కాస్టింగ్ కౌచ్‌పై రమ్య నంబీశన్.. మహిళా ఆర్టిస్టులపై వేధింపులు నిజమే

సోమవారం, 23 ఏప్రియల్ 2018 (09:09 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ తారలు ఒక్కొక్కరు స్పందిస్తున్న నేపథ్యంలో.. తాజాగా చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంప్రదాయం ఉందని కోలీవుడ్ నటి, గాయని రమ్య నంబీశన్ స్పష్టం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు ఎదురు కావడం నిజమేనని వెల్లడించారు.
 
సినీ రంగంలో అవకాశాల పేరుతో సెక్యువల్ ఫేవర్ ఆశిస్తారని.. తనకు అలాంటి ఘటనలు ఎదురుకానప్పటికీ.. పలువురు సహనటులు చెప్తుంటే విన్నానని తెలిపింది. ఈ సంప్రదాయాన్ని అడ్డుకునేందుకు మహిళా నటులు ధైర్యంగా పోరాడాలని రమ్యనంబీశన్ పిలుపు నిచ్చారు. కాగా పిజ్జా, సేతుపతి సినిమాలతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఈ భామ తాజాగా ప్రభుదేవాతో ''మెర్క్యురీ'' సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు కాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ స్పందించింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని.. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని చెప్పింది. పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వెనుకాడటం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని... ఎన్నో చోట్ల ఇది కొనసాగుతోందని చెప్పింది.  
 
అయితే మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని తెలిపింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదా తెలిపింది. బాలీవుడ్‌లో అవకాశాలు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే... అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయని చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు