కరోనా వైరస్ దెబ్బకు అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇలాంటివారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. అందుకే రిలయన్స్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల పట్ల మానవత్వం చాటుకుంది. కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది.
అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లలకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్ వసతి, ట్యూషన్ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగి కరోనా బారినపడిన సమయంలో వారు పూర్తి కోలుకునే వరకు పూర్తి కాలానికి కోవిడ్ సెలవులను పొందవచ్చని తెలిపింది.