వివరాల్లోకి వెళితే... కేరళలోని తిరువనంతపురం పక్కనే ఉన్న కారికకోమ్ కోవిల్‌లో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని ఉదయం పాఠశాలకు బయలుదేరడానికి సిద్ధమవుతోంది. అప్పుడు ఆమె తల్లి విద్యార్థిని షూ తీసుకొని ఆమెకి ధరింపచేయడానికి సిద్ధమైంది. అనుకోకుండా, విద్యార్థిని షూ నుండి కోబ్రా పడగవిప్పుతూ బయటకు వచ్చింది. ఇది చూసిన విద్యార్థిని, ఆమె తల్లి షాక్ తిన్నారు.
వెంటనే ఒక పెద్ద గిన్నెను తీసుకుని ఆ పాము షూ నుంచి బయటకు రాకుండా బోర్లించింది. అటు తర్వాత పాములను పట్టుకునే సురేష్‌కు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే సురేష్ ఆ పాత్రను తీసివేసి, పామును బయటకు లాగాడు. ఈ సందర్భంగా అతడు పెద్దలకి, స్కూలు పిల్లలకి హెచ్చరిక చేశాడు. బూట్లు ధరించే ముందు, లోపల కీటకాలు ఉన్నాయా అని విద్యార్థులు తనిఖీ చేయాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అతడు పేర్కొన్నాడు. చూడండి ఆ వీడియోను.