యోగా కోసం 80 అడుగుల ఎత్తుతో కూడిన భవనంలో తలకిందులుగా నిలబడిన యువతి దారుణంగా గాయాలపాలైంది. యోగా చేస్తానని.. తలకిందులు నిలబడిన ఆ యువతి అదుపుతప్పి జారిపడటంతో తీవ్ర గాయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని ఓ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి అలెక్సా థెరిసా.
వెన్నెముక, నడుము, తలకు భారీ గాయాలైనాయి. థెరిసా పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే.. థెరిసా స్నేహితురాలు.. ఆమె యోగా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.