స్విస్ జంతు ప్రదర్శనశాలలో పుట్టిన అరుదైన తాబేలు

సోమవారం, 13 జూన్ 2022 (12:54 IST)
స్విట్జర్లాండ్‌లోని ఓ జంతు ప్రదర్శనశాలలో అరుదైన తాబేలు జన్మించింది. ఈ దేశంలోని సర్వియన్‌లోని ట్రోపిక్వేరియం జూ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇటీవలే రెండు బేబీ జెయింట్ గాలాపాగోస్ తాబేళ్లను స్వాగతించినట్టు వెల్లడించిన జూ అధికారులు వీటిలో ఒకటి దాని తల్లిదండ్రులు మాదిరిగానే ముదురు రంగుతో ఉంటే మరొకటి ఆల్బినిజం రంగులో ఉందని వారు వెల్లడించారు. తాబేలు జాతుల్లో ఇది అరుదైనదిగా పేర్కొంటున్నారు. అయితే, ఈ తాబేలు ఏ జాతికి చెందిందన్న విషయాన్ని ఇంకా నిర్థారించేదు. 
 
"అంతరించిపోతున్న ప్రత్యేకించి అల్బినో జాతి వంటి జాతి పుట్టడమనేది చాలా అరుదైన విషయమని, అసాధారణ విషయమని పేర్కొన్నారు. అల్బినో గాలాపాగోస్ తాబేలు పుట్టి బందిఖానాలో ఉంచడ ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మానవులలో 20 వే మందిలో ఒకరు ఎలా అరుదుగా జన్మిస్తారో అదే విధంగా లక్ష తాబేళ్ళలో అల్బినిజం తాబేలు చాలా అరుదుగా పుట్టిందని జూ అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు