77 ఏళ్లలో కుర్రాడిలా.. Joe.. జై బైడెన్.. క్రిస్మస్ ట్రీ కొనడానికి వెళ్తూ.. భార్య, కూతురు..?

సోమవారం, 18 జనవరి 2021 (14:42 IST)
Joe Biden జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరవబోతున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరుకాబోనని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేల్చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతల బదలాయింపు ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
 
మరో మూడ్రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జో బైడెన్, తన పరిపాలన సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరికొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకుని తీవ్ర సమస్యల్లో ఉన్న అమెరికాను త్వరితగతిన గట్టెక్కించాలన్న పంతంతో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన 20 మందిని తన టీమ్ లోకి తీసుకోవడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. జనవరి 20న అమెరికా అధినేతగా పగ్గాలు చేపట్టబోతుండగా, భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేయడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  జో బైడెన్ నామినేట్ తన టీమ్ లోకి తీసుకున్న 20 మంది భారత సంతతి నేతల్లో 13 మంది మహిళలే. ఆ 20 మందిలో 17 మంది వైట్ హౌస్ లోనే కీలక పోస్టులకు ఎంపికయ్యారు.
 
కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కమలా హారిస్ కూడా భారతీయ మూలాలు కలిగిన నేతే కావడం గమనార్హం. అదే సమయంలో అమెరికాకు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతోంది కూడా కమలా హారిసే అవ్వడం విశేషం. 
Joe Biden

 
ఇదిలా ఉంటే.. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో-బైడెన్ గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది. ఆయన వ్యక్తిగత వివరాలకు సంబంధించి నెట్లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే జో బైడెన్‌కి సంబంధించిన వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.. జో బైడెన్ 77 ఏళ్ల వయస్సులో అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు అయ్యారు. వృద్ధాప్యంలో ఉన్నాం అనుకునేవారి ఇదొక గొప్ప స్ఫూర్తిని నింపే పాఠం. 
 
అధ్యక్ష పదవి చేపట్టడానికి 77 ఏళ్ల వయస్సులో శారీరకంగా, మానసికగం ఆయన దృఢంగా ఉన్నారు. 60 ఏళ్లు దాటితేనే వృద్ధులు అనుకునే వారికి ఇదో కొత్త ప్రేరణ అని చెప్పవచ్చు. అలాంటి వారు ఇక కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవాల్సిందే. ఇప్పటి వరకు సాధించలేనివి ఇప్పుడైనా సాధించేలా లక్ష్యం పెట్టుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే.. కొంతమంది కుర్రాళ్లు పుట్టుకతోనే వృద్ధులను పోలివుంటారు. మరికొంతమంది పావన నవజీవన నిర్మాతలుగా వుంటారు. వారికి తప్పకుంటే జై కొట్టాల్సిందే. 
 
ఇక జో బైడెన్ గురించి మరికొన్ని విషయాలను పరిశీలిస్తే.. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుడైన 77 ఏళ్ల జో బైడెన్ భార్య, కూతురు క్రిస్మస్ చెట్టు కొనడానికి పోతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మెదడు క్యాన్సర్‌తో ఒక కుమారుడు చనిపోయాడు. మత్తు పదార్థాలకు బానిసై రెండో కొడుకు నౌకాదళం ఉద్యోగం కోల్పోయాడు. బైడెన్‌కు ఫేషియల్ ప్యాల్సీ అనే ముఖ పక్షవాతం వుంది. ఇన్ని రకాల సమస్యలతో సతమతమౌతున్నా.. లేటు వయస్సులో అగ్రరాజ్యానికి అధ్యక్షుడుగా అయ్యారు. సో.. ఆయనకు సెల్యూట్ కొట్టాల్సిందే. ''జై'' బైడెన్...!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు