జైళ్ళుగా మారిపోతున్న యూపీ కాలేజీలు... ఎందుకు?

గురువారం, 7 నవంబరు 2019 (10:04 IST)
70 యేళ్లుగా నలుగుతున్న రామజన్మభూమి, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు త్వరలోనే తుదితీర్పును వెలువరించనుంది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వారణాసి, లక్నో, అలహాబాద్ ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు.
 
ఇక రాష్ట్రంలోని పలు కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా అధికారులు మార్చారు. తీర్పు వచ్చిన తర్వాత ఓ వర్గం వారు అల్లర్లకు దిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించారు. దీంతో అధికారులు అప్పమత్తమయ్యారు. 
 
ముందుజాగ్రత్త చర్యగా, గతంలో గొడవల్లో పాల్గొన్న వేలాది మందిని ఈ జైళ్లకు తరలిస్తున్నారు. ఇవన్నీ తాత్కాలిక జైళ్లేనని, తీర్పు వెలువడి, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత, ఏ కేసూ లేకుండా వీరిని విడిచిపెడతామని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 8 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు