చేతి పంపు నుంచి నీటికి బదులు రక్తం.. హడలిపోతున్న స్థానికులు.. ఎక్కడ?

బుధవారం, 11 డిశెంబరు 2019 (17:20 IST)
సాధారణంగా చేతి పంపు నుంచి నీరు వస్తాయి. కానీ, ఆ హ్యాండ్ పంపు నుంచి రక్తం దారగా వస్తోంది. ఈ వింతను చూసిన స్థానికలు భయంతో వణికిపోతున్నారు. ఆ పంపు సమీపానికి వెళ్లేందుకు కూడా ఓ ఒక్కరూ సాహసం చేయడం లేదు. ఈ ఆశ్చర్యకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్ పరిధిలోని జాఖోడీ గ్రామంలో కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హమీర్‌పూర్ పరిధిలోని జాఖోడీ గ్రామంలో వంద గృహాలు ఉండే ఓ కాలనీలో తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఓ బ్యాండ్ పంపును వేసింది. ఆ హ్యాండ్ పంపు నుంచి నీటికి బదులుగా రక్తమాంసాలు వస్తున్నాయి. దీనిని చూసిన గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
అదేవిధంగా ఈ హ్యాండ్‌పంప్ నుంచి వచ్చే నీరు తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయం తెలుసుకున్న హమీర్‌పూర్ జిల్లా కలెక్టర్ ఈ ఉదంతంపై విచారించాలని ఎస్డీఎంకు ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆ హ్యాండ్ పంప్‌ను తెరిచి చూసినప్పటికీ, ఈ విధంగా దాని నుంచి రక్తం రావడానికి ప్రత్యేక కారణమేదీ తెలియరాలేదు. దీంతో అధికారులు ఆ హ్యండ్ పంప్‌ను బంద్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు