పారాగ్లైడింగ్.. సెల్ఫీ స్టిక్‌పై వాలిన రాబందు.. నెట్టింట వైరలైన వీడియో

శనివారం, 17 అక్టోబరు 2020 (16:55 IST)
Vulture
దక్షిణ పర్వతాలపై ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఆ వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. పారాగ్లైడింగ్ చేస్తూ గాల్లో తేలియాడుతుండగా ఆకాశం మధ్యలో ఓ రాబందు సెల్ఫీ కర్రపై వాలింది. అంతే కాకుండా వారితో పాటు కొంత దూరం కూడా ప్రయాణం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ఇది జరిగింది. అది ఏ మాత్రం పట్టుతప్పకుండా స్టిక్‌తో పాటే ప్రయాణం చేసిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేలా సాధ్యమైంది అని కామెంట్లు పెడుతున్నారు. స్పెయిన్‌లో ఇది చోటుచేసుకుంది.
 
పారాగ్లైడింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఓ రాబందు వచ్చి వాలింది. కానీ వాళ్లు దాన్ని ఏమి అనకుండా అలాగే ఉండిపోవడంతో కొంత సేపటికి ఎగిరిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు. రాబందు అలా వాలడానికి కారణం కూడా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పక్షులు గాల్లో ఎగిరే సమయంలో అలసిపోవడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా చెట్టు, ఇతర వస్తువులపై వాలుతూ ఉంటాయి. 
 
అలాగే రాబందుకు సెల్ఫీ స్టిక్ కనిపించడంతో వాలిపోయింది. తిరిగి ఎగిరేందుకు శక్తిని కూడగట్టుకోగానే దాని దారిలో అది వెళ్లిపోయింది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Vulture hitches ride on selfie stick pic.twitter.com/fgNg03E2QY

— Freaking Awesome (@freak1ngawesome) October 16, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు