2014లో అరకు నుంచి పోటీ చేసిన కిడారి... శివేరి సోముపై విజయం సాధించారు. శివేరి సోము 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. మావోయిస్టుల కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు తోపాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా ప్రాణాలు కోల్పోయారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో కిడారి, శివేరి సోముకు మంచి పేరు ఉంది.
దీనికి కారణం పచ్చని అడవుల్లో పర్యావరణాన్ని దెబ్బతీసేలా మైనింగ్ తవ్వకాలను కిడారి చేపట్టారు. వీటిపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తూ వచ్చారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న క్వారీని తక్షణం మూసివేయాలని మావోలు డిమాండ్ చేశారు. కానీ, ఇవేమీ పట్టించుకోని కిడారి.. యధేచ్చగా మైనింగ్ తవ్వకాలు జరిపిస్తూ వచ్చారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారి హత్య చేశారు.
నిజానికి విశాఖ మన్యంలో గత కొంతకాలంగా మావోయిస్టులు అలజడి లేదు. చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రేహౌండ్స్ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఇపుడు కాల్పులకు తెగబడ్డారు.