అది ఎవరో కాదు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ. రజినీకి గతంలో మంత్రి పదవి దగ్గలేదు. ఎంతో ఆశగా ఉన్న ఆమెకు మొండిచేయే చూపించారు సిఎం. దీంతో రజినీ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలి కాబట్టి మిన్నకుండి పోయారు. ఎమ్మెల్యేగాను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న రజినీపై జగన్మోహన్ రెడ్డి మంచి అభిప్రాయమే ఉందట.
దీంతో మహిళా కోటాలో రజినీకి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి సిఎం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోజాకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు, అనుచరులు భావిస్తున్నారు. అందుకే ఆమెను ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించారని కూడా అనుకున్నారు.