లిమ్కా రికార్డ్‌లలోకి బీఎస్ఎన్ఎల్ స్పోర్ట్స్ క్విజ్

FileFILE
దూరదర్శన్‌కు చెందిన పొదిగై ఛానెల్‌లో ప్రసారమయ్యే బీఎస్ఎన్ఎల్ స్పోర్ట్స్ క్విజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. భారత్‌లో ఓ టెలివిజన్‌లో సుదీర్ఘకాలం పాటు ప్రసారం అయి ఎక్కువ ఎపిసోడ్‌లు జరుపుకున్న షోగా బీఎస్ఎన్ఎల్ స్పోర్ట్స్ క్విజ్ లిమ్కా రికార్డ్‌లలో స్థానం సంపాదించింది.

చెన్నైలో విలేకరుల సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ, బీఎస్ఎన్ఎల్ సమర్పణలో తాము ప్రసారం చేసిన స్పోర్ట్స్ క్విజ్ 2002లో ప్రారంభమైందన్నారు. ప్రతి షోకు దాదాపు 30వేల మంది వీక్షకులు మరియు 3వేల ఇమెయిళ్లను స్వీకరించామన్నారు.

ప్రతి వారం ఎస్ఎంఎస్ ద్వారా లైవ్ పోటీలను కూడా నిర్వహించామన్నారు. ఇందులో ప్రతివారం 2వేల మంది వీక్షకులు పాల్గొన్నారని సుమంత్ వివరించారు. ఈ పోటీలో పాల్గొన్నవారు... భారత్‌లోని వివిధ నగరాల నుండే కాకుండా.. చైనా, లాట్వియా, ఒమన్, దుబాయ్, సౌదీ అరేబియా వంటి ప్రాంతాల నుండి కూడా వచ్చారన్నారు.

జూన్ 2002లో ఫిఫా ప్రపంచకప్‌తో ఈ షో ప్రారంభమైంది. జూలై 18, 2009 నాటికి ఈ షో 373 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ప్రోగ్రామర్లు మరియు ఇంజినీర్ల బృందం చేసిన కృషి వల్లే ఈ షో ఇంత విజయవంతం కావడానికి గల కారణంగా సుమంత్ పేర్కొన్నారు. డీడీ చెన్నై ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ పరమేశ్వరన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా, ఈ షో వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి