చిదంబరం బడ్జెట్ 2013 'మొండి ఱంపం'... వేతన జీవులకు నిరాశే

గురువారం, 28 ఫిబ్రవరి 2013 (23:33 IST)
PTI
ఆర్థిక మంత్రి చిదంబరం 2013 - 14 బడ్జెట్ ప్రవేశపెడుతుంటే వేతన జీవులంతా వ్యక్తిగత పన్ను మినహాయింపుపై ప్రకటన కోసం ఎదురుచూశారు. కానీ ఆయన ఐటీ శ్లాబులు గురించి ప్రకటించిన వెంటనే పెదవి విరిచారు. ఆయన బడ్జెట్ ఓ మొండి ఱంపం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిదంబరం ప్రకటించిన ఐటీ శ్లాబులు గురించి ఒక్కసారి చూద్దాం.

సంవత్సరాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్నవారు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారిపై 10 శాతం పన్ను యధాతథంగా ఉంచారు. ఐతే రూ. 5 లక్షల ఆదాయం లోపు ఉన్నవారికి రూ. 2000 టాక్స్ క్రెడిట్ లభిస్తుంది.

ఇకపోతే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఆర్జించేవారిపై 20 శాతాం పన్ను గతంలో మాదిరిగానే ఉంటుంది. రూ. కోటి ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్నుతో అదనంగా ఈ ఏడాది నుంచి 10 శాతం సర్ చార్జి ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏతావాతా ఈ బడ్జెట్లో వేతన జీవులకు ఒరిగింది ఏమీ లేదు.

వెబ్దునియా పై చదవండి