ఫిబ్రవరి ఒకటో తేదీ గురువారం కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో దాఖలు చేయనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు. అయితే, ఈ బడ్జెట్ తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గక పోవచ్చనీ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 7న ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్ష జరుగనున్న క్రమంలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండవచ్చన్న అభిప్రాయపడ్డారు. రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయన్నారు.
వృద్ధిరేటు పెరిగి, ద్రవ్యోల్బణం కూడా పెరిగితే వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యా న్ని మించిపోయి 5.21 శాతం వద్ద ఉన్నదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, గతేడాది ఆగస్టు 2వ తేదీన జరిపిన ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ చివరిసారిగా పావు శాతం వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెల్సిందే