సెన్సెక్స్ పతనం 508 పాయింట్లు

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (13:41 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్‌కు విస్తరించింది. స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్ పన్నును 15 శాతానికి పెంచడంతో 17329.36 వద్ద సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 5124 వద్ద 159.95 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. అదేసమయంలో కార్పొరేట్ పన్ను మరియు సర్‌చార్జ్ రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

సామాజిక రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికలకు యూపీఏ ప్రభుత్వం తన సంసిద్దతను సంకేతాలను అందించిన తరుణంలో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అయితే టెక్స్‌టైల్ రంగానికి సంబంధించిన షేర్లు మంచి లాభాలను చవిచూస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి