క్రాసులా మొక్క లేదా డబ్బు చెట్టు (Crassula Plant or Money Tree), ఇంకా మనీ ప్లాంట్ , వెదురు, దానిమ్మ, షూ పువ్వు మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ధన సమృద్ధి వుంటుంది. క్రాసులా మొక్కను ఇంటి లోపల లేదా ఇంటి ముందు ఉంచవచ్చు.
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల లేదా ఈశాన్య మూలలో ఉంచవచ్చు. దానిమ్మపండును ముఖ్యంగా ఇంటి ముందు బయట ఉంచాలి. వెదురును ఇంటి లోపల లేదా ప్లాట్, వాయువ్య మూలలో ఉంచవచ్చు. ఇంటి ఉత్తరం వైపు లేదా తూర్పు వైపున షూ పువ్వును బహిరంగ ప్రదేశంలో ఉంచడం ద్వారా ఆ ఇంట ఆర్థిక నష్టాలు ఏర్పడవు. అప్పుల బాధలు ఏర్పడవు.