మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు...?

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:11 IST)
ఒకప్పుడు వాస్తును ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పటి కాలంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మా అందుకు ముఖ్యకారణం ఏంటో తెలుసుకుందాం..
 
మనిషి పుట్టుకతో ఆలోచనా పరుడు. కానీ తన ప్రయాణంలో ఒకరు జీవితపు ప్రాధాన్యం వైపు మరొకరు అగాధాల ఆశల వైపు ప్రయాణిస్తుంటారు. ఇద్దరూ తెలివైన వాళ్లే అయి ఉంటారు. కానీ నిర్ణయం అన్నది అక్కడ ప్రధానం. 
 
జీవితం నేర్పుతుంటే నేర్చుకోవడం గొప్పే కానీ.. జీవితంలో అప్పటికే ఎక్కువ కాలం ఖర్చయిపోతుంది. అలా ఉండకూడదనే మన పూర్వులు తమ జీవితాలను పణంగా పెట్టి మన జీవితాలను ఉద్ధరించాలని ఆశించి ఈ శాస్త్రాలను అందించారు.
 
శాస్త్రం వేలుపట్టి తండ్రిలాగ నడిపించదు. గోరుకొయ్య లాగా ఆకాశంలో నిలిచి ఉదయం కాలాన్ని సూచిస్తుంది. మేలుకునే వారు మేలుకుంటారు. ఇప్పుడు, అప్పుడూ శాస్త్రం ఉంది. జనంలో నేడు ఆ దృష్టి పెరిగింది. అవేర్‌నెస్ వచ్చింది. మానవ శక్తికన్నా మిన్నదైంది. జీవితాలను డ్రైవ్ చేసేది ఒకటి ఉంది అని అర్థం అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు