ప్రతిఒక్కరికి ఇళ్లు నిర్మించాలనే ఆశ తప్పకుండా ఉంటుంది. ఈ ఆశ కొందరిలో నెరవేరుతుంది. మరికొందరిలో నెరవేరదు. అలానే ఇళ్ళు కట్టాలనే నిర్ణయం తీసుకున్నవారు.. ఇంట్లోని రూములన్నీ ఒకే కొలతలతో ఉండొచ్చా అని ఆలోచిస్తున్నారు. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ చిన్న విషయానికే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. అందుకోసం ఈ చిట్కాలు..
ఇంట్లో అన్ని రూములు ఒకే కొలతలతో ఉండొచ్చా వద్దా.. అని ఆలోచిస్తున్నారా.. గదుల విభజన దాని కొలతలు ఆయా గృహ యజమానుల అవసరం, గృహ సభ్యుల జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని గదులు ఒకే కొలత ఉండాలనేది ప్రాచీన నిర్మాణ పటిష్టతలో చెప్పబడింది. అది నేటి జీవన అవసరాలకు పనికిరాదు.