ఊర మామిడి పచ్చడి ఎలా చేయాలి?

FILE
మామిడిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్ -బి6, విటమిన్-సి, విటమిన్-ఈ పుష్కలంగా ఉన్నాయి. అలాంటి మామిడిలో నోరూరించే ఊర మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ట్రై చేద్దామా..

ఊరగాయకు కావలసిన పదార్దాలు :
మామిడికాయలు - 25
100 గ్రాముల మెంతిపిండి
1/4 కిలో వెల్లుల్లి
1 కిలో నూనె
ఒక శేరు కారం పౌడర్
ఒక శేరు ఉప్పు
అర శేరు ఆవపిండి

ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఊరగాయకు తగ్గట్టు ముక్కలు చేసుకోవాలి. కోసిన ముక్కలను తేమలేకుండా శుభ్రంగా పొడి బట్టతో తుడవండి. ఒక బేసిన్ తీసుకోని అందులో కారం పౌడర్, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి ముక్కలు ఇవి అన్ని బాగా కలిపి అందులో 1/4 నూనె కలిపి, మామిడి ముక్కలను అందులో వేసి బాగా కలపండి. ఒక శుభ్రమైన జాడిని తీసుకోని కడిగి తేమలేకుండా ఎండలో ఆరబెట్టండి.

ఒకసారి జాడిలోపల పొడి బట్టతో శుభ్రమగా తుడిచి పైన కలిపిన పదార్దాలన్ని జాడీలో వేసి మూతపెట్టండి.
5 రోజుల తరువాత జాడి మూతతిసీ ఒక గరిట తీసుకొని శుభ్రంగా కలిపి, మిగిలిన నూనెను అందులో వేసి బాగా కలపండి. 10 రోజుల తరువాత ఈ ఊరగాయకు మీకు నచ్చినట్లు పోపు పెట్టుకుని జాడీల్లో దాచుకుంటే ఊరగాయ రెడీ అయినట్లే.

వెబ్దునియా పై చదవండి