డ్రై ఫ్రూట్‌తో పనియారం ఎలా చేయాలి?

దక్షిణాది వంటకాల్లో పనియారం ఫేమస్. మసాలా పనియారం, స్వీట్ పనియారం అంటూ వివిధ టేస్టుల్లో పనియారాన్ని అందరూ ఇష్టపడి తింటారు. అలాంటి పనియారంను డ్రై ఫ్రూట్‌తో తయారు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. అసలే డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. అలాంటి డ్రై ఫ్రూట్స్‌ను పచ్చిగా తినకుండా పనియారంలా తయారు చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు.

కావలసిన పదార్థాలు :
ఖర్జూరం - వంద గ్రాములు
జీడిపప్పు - వంద గ్రాములు
బాదం పప్పు - వంద గ్రాములు
పిస్తా పప్పు - వంద గ్రాములు

కావలసిన పదార్థాలు :
ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, ఇడ్లీ పిండిలో చేర్చి నెయ్యితో పనియారం బాణలిలో ఉడికించి తీసుకోవచ్చు. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి