పన్నీర్ సమోసా తయారు చేయడం తెలుసా?

శనివారం, 5 అక్టోబరు 2013 (16:11 IST)
FILE
కావలసినవి పదార్థాలు :
పనీర్ తురుము : 1 కప్పు,
మైదా : 1 1/2 కప్పు
ఉల్లిపాయ తరుగు : అరకప్పు
క్యాప్సికమ్ తరుగు : పావుకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా
గరం మాసాలా : 1 చెంచా
ఉప్పు, నూనె : తగినంత

తయారు చేయు విధానం : మైదా పిండిలో నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కాసింత నూనె వేడిచేసి ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. వేగాక పనీర్ తురుము. ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా నీరుపోసి, మూతపెట్టి ఉడికించాలి. మైదా పిండితో చపాతీలు చేసి, ఉడికించిన పనీర్ ముద్దను మధ్యలో ఉంచి, సమోసాల్లా ఒత్తుకుని నూనెలో వేయించాలి.

వెబ్దునియా పై చదవండి