బీట్‌రూట్ సలాడ్ తీసుకుంటే..?

FILE
బీట్‌రూట్‌లో రక్తాన్ని శుభ్రపరిచే లక్షణం ఉంది. ఇందులో విటమిన్‌ సి, పొటాషియం ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ పేషేంట్లు ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ కారక కణాలు వృద్ధి కాకుండా నిరోధిస్తుంది. ఇది త్వరగా జీర్ణం కాదు కనుక మంచి నీరు ఎక్కువగా తాగుతుండాలి.

కావలసిన పదార్థాలు:
బీట్‌రూ‌ట్‌ తురుము - ఒక కప్పు.
కొత్తిమీర తరుగు - ‌ఒక టీ స్పూను.
నిమ్మరసం - అర టీ స్పూను.
టొమాటో తరుగు - రెండు టీ స్పూనులు.
ఉప్పు - తగినంత.
పోపుకి - నూనె, ఆవాలు. జీలకర్ర, ఎండుమిర్చి కొద్ది కొద్ది

తయారీ విధానం:
బీట్‌రూట్ తురుములో టొమాటోతరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తరువాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెషెగా తినాలి. ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్ల రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి