మష్రూమ్‌తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి?

మంగళవారం, 5 మార్చి 2013 (18:54 IST)
FILE
మష్రూమ్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. అలాంటి మష్రూమ్‌తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :
బాస్మతి రైస్ - అర కేజీ
మష్రూమ్ - 1/4 కేజీ
ఉల్లి తరుగు - అరకప్పు
అల్లం, వెల్లుల్లి - ఒక టీ స్పూన్
చిల్లీ సాస్ - రెండు టీ స్పూన్లు
సోయా సాస్ - రెండు టీ స్పూన్లు
వైట్ పెప్పర్ పౌడర్ - అర టీస్పూన్
ఉల్లికాడలు - కాసింత
ఉప్పు, నూనె - తగినంత

తయారీ విధానం :
ముందుగా బాస్మతి రైస్‌ను ఉడికించి పక్కనబెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనె పోసి ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్ చేర్చి దోరగా వేయించాలి. తర్వాత ఉడికించిన బాస్మతి రైస్‌ను అందులో చేర్చి సోయా సాస్, చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి కలియబెట్టాలి. చివరిగా కాసింత ఉల్లికాడలు, ఉల్లితరుగు చేర్చి కాసేపు కలియబెట్టి దించేయాలి. ఈ రైస్‌కు టమోటాసాస్ లేదా కడాయ్ పనీర్, కడాయ్ చికెన్ గ్రేవీలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి