మామిడి రైతా ఎలా చేయాలో తెలుసా?

FILE
ఎప్పుడూ ఉల్లి రైతాతో బిర్యానీ టేస్ట్ చేసి బోర్ కొట్టేసిందా.. అయితే ఈ వీకెండ్ మామిడి రైతాతో హాట్ హాట్ బిర్యానీ టేస్ట్ చేసి చూడండి. సరే మీకు మామిడి రైతా తయారీ చేయడం వచ్చా.. రాదంటే.. ఇదిగోండి రిసిపి..

కావలసిన పదార్థాలు :
మామిడి ముక్కలు - ఒక కప్పు
గట్టి పెరుగు - మూడు కప్పులు.
ఆవాల పొడి - ఒక టీ స్పూను
కారం - పావు టీ స్పూను.
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
పెరుగు చిలక్కొట్టి (నీళ్ళు కలపకుండా)అన్ని పొడులూ కలుపుకోవాలి. చివర్లో మామిడి ముక్కలు వేసి పెట్టండి. చల్లగా తినాలనుకుంటే పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవచ్చు. ఇక తయారు చేయడానికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

వెబ్దునియా పై చదవండి