రవ్వతో చేసుకునే వంటకాలను తీసుకోవడం ద్వారా రిచ్ ప్రోటీన్స్ మన శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కార్పొహైడ్రోట్స్, విటమిన్ బి, ఐరన్ లభించే రవ్వతో అట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు : బొంబాయిరవ్వ - వంద గ్రాములు. మైదా, బియ్యపు పిండి - వంద గ్రాములు. నూనె - 200 గ్రాములు. పచ్చిమిర్చి - ఆరు. జీలకర్ర - 3 చెంచాలు. పుల్లనిమజ్జిగ - తగినంత. ఉప్పు - తగినంత. కరివేపాకు - 2 రెబ్బలు.
తయారీ విధానం : ముందుగా రవ్వ, మైదా, బియ్యపు పిండి మజ్జిగలో (నీళ్ళలో) పోసి జారుగా కలిపి 1-2 గంటలు నాననివ్వాలి. అనంతరం సరిపడా ఉప్పు కలపాలి. పచ్చిమిర్చి సన్నగా చిన్నముక్కలుగా తరిగి కరివేపాకు జీలకర్రలతో కలిపి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
పెనం కాలిన తరువాత, పిండిని అట్లుగా పోసుకొని బాగా కాలాక తీసుకోవాలి. ఈ రవ్వ అట్టును పుదీనా చట్నీతో నంజుకుని తింటే సూపర్‌గా వుంటాయి.