వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలి?

FILE
బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వ్యాపించే దగ్గు, జలుబు, చర్మ వ్యాధులను నయం చేయాలంటే.. మీరు చేయాల్సిందల్లా వెల్లుల్లిని ఆహారంలో అధికంగా చేర్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వెల్లుల్లితో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా..

కావలసిన వస్తువులు:
వెల్లుల్లిరేకులు - ఐదు కప్పులు.
కారం - 1 కప్పు
జీలకర్ర - 1 టీ స్పూను.
ఆవపిండి - అర కప్పు.
ఇంగువ - అర టీ స్పూను.
నిమ్మరసం - 1 కప్పు.
నువ్వులనూనె - 2 కప్పులు.
పసుపు - పావు టీ స్పూను.
ఉప్పు - ముప్పావు కప్పు.
మెంతిపొడి- పావుకప్పు.

తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లి రేకుల్ని పొట్టుతీసి శుభ్రం చేయాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపిన తరువాత మిగిలిన నువ్వుల నూనెను పచ్చడిమీద పోయాలి. గాలి చొరవకుండా నిల్వచేస్తే ఆరు నెలలపాటు పాడవకుండా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి