సొరకాయ, తోటకూర పులుసు టేస్ట్ అదిరిపోద్ది. సొరకాయ, తోటకూరలో ఎన్నో పోషకాలున్నాయి. శరీరానికి కావలసిన తేమనిచ్చే సొరకాయను, ఐరన్ శక్తిని ఇచ్చే తోట కూరను పులుసు చేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం..
కావలసిన పదార్థాలు: సొరకాయ - రెండు కప్పులు తోటకూర - రెండు కప్పులు చింతపండు గుజ్జు - 2 చెంచాలు. టమోటా ముక్కలు - ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు ఉప్పు - తగినంత. కారం - చెంచాడు.
తయారీ విధానం: ముందుగా తరిగి పెట్టిన తోటకూరను తిరగమోత వేయాలి. అందులో సొరకాయ, టమోటా, పచ్చి మిరప, ఉల్లి ముక్కలు వేసి బాగా ఉడికించాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి సన్నని సెగపై ఉడకనియ్యాలి. మెత్తగా ఉడికిన తర్వాత దించేసి దానికి చెంచా నేతిని కలిపి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.