సోయా పన్నీర్ పఫ్ ఎలా చేయాలి..?

FILE
సోయా పన్నీర్‌లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం అండ్ ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ లేని సోయా పన్నీర్ డయాబెటిస్‌ను నయం చేస్తుంది. ఇంకా లో ఫాట్ గుండె సంబంధిత రోగాలకు చెక్ పెడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి సోయా పన్నీర్‌తో పఫ్ చేస్తే ఎలా వుంటుందో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
సోయా పన్నీర్ - 200 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర - సరిపడా.
కార్న్ ఫ్లోర్ - 20 గ్రా.

తయారీ విధానం :
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకుని. ఒక్కో పన్నీర్ స్లైస్‌పై అల్లం, పుదీన మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్‌తో మూసివేసి దాన్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడి వేడిగా సోయా సాస్‌తో సర్వ్ చేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్‌గా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి