క్యారట్‌లో విటమిన్ ఎ, మినరల్స్, యాంటీ-యాక్సిడెంట్స్ అధికంగా వున్నాయి. అలాంటి క్యారెట్‌లో సూప్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది..
కావలసిన పదార్థాలు: క్యారట్ - 400గ్రా. ఉల్లిపాయ - ఒకటి. పెసరపప్పు - ఒక టేబుల్ స్పూన్. వెన్న తీసిన పాలు - ఒక కప్పు. ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి. ఇందులొ వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి.