ముందుగా నేతిలో మసాలాదినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకున్న తరువాత క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి బాగా వేగించాలి. తరువాత ఆ మిశ్రమంలో కొబ్బరిపాలు పోసి అవి మరిగాక నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే గసగసాల పులావ్ రెడీ.