దొండకాయలోని విటమిన్ బి నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది కనుక దొండ మనస్సును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. మరి ఇటువంటి దొండకాయతో బిర్యాని ఎలా తయారుచేయాలో చూద్దాం.
నిమ్మరసం - 1 స్పూన్
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
తయారీ విధానం:
ముందుగా బియ్యం పొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి నిలువుగా తరిగిన దొండకాయల్ని 15 నిమిషాలు వేగించి తీసేయాలి. అదే నూనెలో ఉల్లి, అల్లం వెల్లుల్లి, పుదీనా వేగించి కొబ్బరి పేస్ట్ కలుపుకోవాలి. 2 నిమిషాల తరువాత ధనియాలు పొడి, జీరాపొడి, పసుపు, ఉప్పు, కారం కలిపి దొండకాయ ముక్కలు వేసి 7 నిమిషాలు వేగాక ఆ మిశ్రమంలో అన్నం, నిమ్మరసం కలుపుకుని దించేయాలి. అంతే దొండకాయ బిర్యాని రెడీ.