తయారీ విధానం:
ముందుగా క్యారెట్స్‌ను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసి వాటిలో కొద్దిగా ఉప్పు, నీరు పోసి ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకుని ఆ తరువాత క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చి మిశ్రమం వేసి 5 నుండి 8 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో వేడి వేడి అన్నం కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్తీ క్యారెట్ రైస్ రెడీ.