తయారీ విధానం:
ముందుగా బాణలిలో ఓట్స్ వేసి గోధుమ రంగు వచ్చేవరకూ నూనె లేకుండా వేయించుకోవాలి. ఆ తరువాత పొడి చేయాలి. అదే బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేగించి.. ఆ తరువాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, పసుపు కలిపి 3 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పొడి చేసిన ఓట్స్, పెరుగు వేసి ఇండ్లీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ల కలపకూడదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండి నింపి ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... వేడి వేడి ఓట్స్ ఇడ్లీ రెడీ.