గసగసాలతో పాయసమే కాదు.. పులావ్ కూడా చేయోచ్చు.. ఎలా..?

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (13:16 IST)
గసగసాలు ఎక్కువగా కూరలలో మసాలా కోసం వాడుతుంటారు. ఇది వేయడం వలన ఆ కూరకు కమ్మని రుచి వస్తుంది. మాంసాహారంలో మసాలా కోసం దీనిని అధికంగా వేస్తారు. కొంతమందైతే గసగసాలలో పాయసం కూడా చేస్తారు. కానీ ఇవి పిల్లలకు అంతగా నచ్చవు. కనుక వీటిలో పులావ్ చేసిత్తే తప్పకుండా తింటారు. మరి గసగసాల పులావ్‌కు కావలసిన పదార్థాలు, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
  
 
కావలసిన పదార్థాలు: 
గసగసాల మిశ్రమం - అర కప్పు 
కొబ్బరి పాలు - 3 కప్పులు
బియ్యం - 1 కప్పు
క్యారెట్‌ ముక్కలు - అర కప్పు 
ఉల్లిపాయ - 1 
పచ్చిమిర్చి - 3 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
టమాటా ముక్కలు - 1 కప్పు
నెయ్యి - 25 గ్రాములు
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
లవంగాలు - 5 
యాలకులు - 3 
దాల్చిన చెక్క - చిన్నది
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం:  
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో మసాలాదినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఆ తరువాత క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్, మిగిలిన పదార్థాలన్నింటిని వేసి వేయించుకోవాలి. చివరగా కొబ్బరిపాలు పోసి మరిగిన తరువాత నానబెట్టిన బియ్యం,  ఉప్పు వేసి ఉడికించుకుని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే... ఘుమఘుమలాడే గసగసాల పులావ్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు