ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ సూప్ ఎలా చేయాలో మీకు తెలుసా?

FILE
ఇంట్లోనే టేస్టీ సూప్ తయారు చేయడం వస్తే.. షాపుల్లో లభ్యమయ్యే సూప్ ప్యాకెట్లను కొనే అవసరముండదే అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.

* సూప్ చేయడానికి ముందు మూడున్నర స్పూన్ బటర్‌ను కరిగించి, అందులో ఒక స్పూన్ మైదాను చేర్చి కలుపుతూ వుంటే క్రీమ్‌లా తయారవుతుంది. ఈ క్రీమ్‌తో సూప్ చేస్తే చిక్కనైన సూప్ లభిస్తుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా సూప్‌లో చేర్చుకోవచ్చు.

* అలాగే చిన్న చిన్న బ్రెడ్ ముక్కలను నేతిలో వేపి సూప్‌లో కలుపుకుంటే హోటల్‌లో లభించే టేస్ట్ ఉంటుంది. బాగా పండిన రెండు టమోటాలను తీసుకుని తొక్క, గింజల్ని తీసేసి గుజ్జు చేసుకోవాలి. దీనితో పాటు తెల్ల గుమ్మడి ముక్కలు ఓ అరకప్పు, కాలిఫ్లవర్ అరకప్పు, వెల్లుల్లి రెబ్బ ఒకటి, ఉల్లిపాయ తరుగు అరకప్పు చేర్చి కుక్కర్లో ఓ విసిల్ వచ్చేంతవరకు ఉడికించాలి.

కుక్కర్లో ఉడికించిన ఈ మిశ్రమాన్ని మిక్సిలో రుబ్బుకుని, వడగట్టుకోవాలి. దీంతో తగినంత ఉప్పు చేర్చి వేడి చేసి సర్వ్ చేస్తే.. టేస్టీ అయిన సూప్ రెడీ.. కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఈ సూప్ హెల్దీ కూడా.

వెబ్దునియా పై చదవండి