క్యాబేజీ కట్‌పూట్స్ ఎలా తయారు చేస్తారు?

మంగళవారం, 25 జూన్ 2013 (15:50 IST)
File
FILE
క్యాబేజీతో కేవలం కూర మాత్రమే చేసుకుంటారని అనుకుంటాం. అయితే, నిజానికి క్యాబేజీతో అనేక రకాలైన వంటకాలతో పాటు.. వివిధ రకాల కట్‌పూట్స్, కట్‌లెట్స్‌ను తయారు చేయవచ్చు. ఇందులోభాగంగా తొలుత క్యాబేజీ కట్‌లెట్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దీని తయారీకి కావల్సిన పదార్థాలను పరిశీలిస్తే పావు కేజీ క్యాబేజీ తురుము, 100 గ్రాముల ఆలు గడ్డలు. ఒక కప్పు పాప్‌కార్నర్, అర కప్పు పుట్నాల పొడి, పావు చెంచా గరం మసాలా, రెండు చెంచాల చాట్ మసాలా, సరిపడినంత కారం పొడి, చిల్లీసాస్ తగినంత, అరకప్పు మైదా, డెకరేషన్ చేసేందుకు సరిపడా పూదీనా ఆకులు, నూనె, ఉప్పు తగినంత తీసుకోవాల్సి ఉంటుంది.

క్యాబేజి కట్‌పూట్స్‌ను ఎలా తయారు చేస్తారు!
ముందుగా క్యాబేజీ తురుమును ఉడికించి అందులోంచి నీటిని తీసివేయాలి. అలాగే, ఆలు గడ్డలను బాగా ఉడికించి పొట్టు మెత్తగా చేసి పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగాక క్యాబేజీ తురుము, పూదీనా తురుము, ఆలూ, ఉప్పు, కారప్పొడి, గరం మసాలా, చిల్లీసాస్, చాట్ మసాలా వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత దించి వేయాలి.

అది చల్లారిన తర్వాత అందులో పాప్‌కార్న్ పొడి, పుట్నాల పొడి వేసి కలపాలి. మైదాపిండిలో నీళ్లు పోసి గరిటె జారుడుగా చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ మిశ్రమాన్ని కావలసిన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. వాటిని పలుచుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిలో ముంచి కట్‌పూట్ లాగా వత్తి నాన్‌స్టిక్ పెనంపై కాస్త నూనె రాసి సన్నని మంటమీద రెండువైపులా ఎర్రగా కాల్చాలి. అంతే క్యాబేజీ కట్‌లెట్స్ తయారీ. వీటిని వేడిమీద ఆరగిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి