క్యాబేజీ కార్న్ కూర

కావాల్సినవి: సన్నగా తరిగి పలుకుగా ఉడికించిన క్యాబేజి - ఒక కప్పు, ఒక కప్పు ఉల్లి ముక్కలు, గుండ్రంగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు, సరిపడినన్ని జీడిపప్పు ముక్కలు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి 1, ఒక అంగుళమంత కొబ్బరి ముక్క

తయారు చేసే విధానం: మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి రాగానే, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. సగం వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచి ఘుమాయింపు రాగానే, కరివేపాకు, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి.

దోరగా వేగంగానే ఉడికించి పెట్టుకున్న క్యాబేజి ముక్కలతోపాటు బేబీ కార్న్ ముక్కలు కూడా వేసి కలయబెట్టి స్టవ్ మీద 3 నిమిషాలపాటు ఉంచాలి. కూర దింపే ముందు కొబ్బరి, పచ్చిమిరపకాయతో కలిపి నూరి కూరలో వేసి నలువైపులా గరిటతో తిప్పాలి. అంతే ఘుమఘుమలాడే క్యాబేజీ కార్న్ రెడీ. వేడివేడిగా అన్నంలోకి కానీ, చపాతీలోకి గాని తింటే చాలా బాగుంటుంది.

- ఆర్. దమయంతి

వెబ్దునియా పై చదవండి