చలికాలంలో ‌క్యారట్ సూప్ తీసుకుంటే..!?

శుక్రవారం, 14 డిశెంబరు 2012 (18:21 IST)
FILE
అసలే చలికాలం.. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక ఏదైనా వేడి వేడిగా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే మీ మిసెస్ దగ్గర క్యారట్ సూప్ చేయమని చెప్పండి. అదేంటి సూప్‌ల్లో అనేక రకాలుంటే క్యారెట్ సూప్ మాత్రం చేయమని చెప్పమంటున్నారు అని అడిగే మీ ప్రశ్నకు జవాబు ఏంటో తెలుసా.. క్యారెట్‌లో ఉన్న పోషకాలే.

క్యారెట్‌ను జ్యూస్, సూప్ ద్వారానే కాకుండా ఆహారంలో తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పచ్చిగా క్యారెట్‌ను నమిలి తింటే కంటికి ఎంతో మంచిదంటున్నారు. మరి క్యారెట్ సూప్ ఎలా చేయడమని ఆలోచిస్తున్నారా..!

కావలసిన పదార్థాలు :
క్యారట్ : అరకిలో.
పెసరపప్పు : ‌ఒక టేబుల్ స్పూన్‌.
వెన్న తీసిన పాలు : ఒక కప్పు.
ఉల్లిపాయ : ఒకటి.
ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.

తయారీ విధానం :
ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇందులొ వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా బౌల్‌లో కార్న్ చిప్స్‌తో సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి