చిల్లీ పనీర్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

శనివారం, 19 జనవరి 2013 (13:20 IST)
FILE
రోజూ చట్నీలు, పొడులతో పిల్లలు విసిగిపోయారా.. నేతి అన్నం, బాస్మతి రైస్, పూరీ, పరోటా, రోటీలకు సైడిష్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే చిల్లీ పనీర్‌ ట్రై చేయండి. చిల్లీ పనీర్ ఎలా తయారు చేయాలంటే..?

క్యాప్సికమ్ : రెండు కప్పులు
బంగాళాదుంప తరుగు : ఒక కప్పు
బఠాణీలు : అరకప్పు
ఉల్లిపాయలు : అరకప్పు
టమోటా : అరకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్
నూనె : వేయింపుకు తగినంత
నెయ్యి : రెండు టీ స్పూన్లు
గరం మసాలా : అర టీ స్పూన్
నీరు : తగినంత
కొత్తిమీర తరుగు : కాసింత
మిరప్పొడి : ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి : అర టీస్పూన్
పసుపు పొడి : అర టీ స్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
ఉప్పు : తగినంత.

తయారీ విధానం :
ముందుగా పనీర్ ముక్కల్ని నూనెలో దోరగా వేయించుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి, టమోటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా పచ్చివాసన పోయేంతవరకు వేపాలి. ఇందులో గరం మసాలా పొడిని చేర్చాలి. తర్వాత కాప్సికమ్ ముక్కల్ని, బంగాళాదుంప తరుగును చేర్చాలి.

ఈ మిశ్రమానికి బఠాణీలు, ధనియాలు, జీలకర్ర, పసుపు పొడులతో పాటు ఉప్పు, నీరువేసి బాగా కలియబెట్టాలి. ఉడికాక వేయించిన పనీర్ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. ఈ చిల్లీ పనీర్‌ను కొత్తిమీరతో అలంకరించుకుని రోటీలకు సైడిష్‌గా హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి