పెసరపప్పుతో సూప్ ఎలా చేయాలి?

FILE
పెసరపప్పును తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్స్ లభిస్తాయి. సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉన్నందున ఒబిసిటి సమస్యకు చెక్ పెట్టవచ్చు.

శరీరానికి ఎంతో మేలు చేసే ఈ పెసరపప్పును వారానికి నాలుగైదు సార్లైనా ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి పెసరపప్పుతో ఈ వర్షాకాలంలో వేడి వేడి సూప్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా..!

కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము - అరకప్పు
బీన్స్ తురుము - అరకప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
పసుపు పొడి - అర టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
పెసరపప్పు - అర కప్పు
బెల్లం తురుము - అర టీ స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
నూనె - రెండు టీ స్పూన్లు
ఇంగువ పొడి- చిటికెడు
ఉప్పు - తగినంత
నీరు - ఐదు కప్పులు
మిరియాల పొడి - తగినంత

తయారీ విధానం :
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఒక పాత్రలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన వెంటనే ఉల్లి తరుగు, జీలకర్ర అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. బాగా వేగాత క్యారెట్, బీన్స్, నానబెట్టిన పెసరపప్పును చేర్చి వేపాలి. తర్వాత పసుపు పొడి, బెల్లం తురుమును చేర్చి బాగా కలపాలి. చివరిగా నీటిని చేర్చి ఉడికించాలి. స్టౌను సిమ్‌లో ఉంచి పెసరపప్పు బాగా ఉడికాక మిరియాల పొడిని చేర్చి వేడివేడిగా సర్వ్ చేస్తే ఈ వర్షాకాలంలో పెసరపప్పు సూప్‌ అదిరిపోద్ది..!

వెబ్దునియా పై చదవండి