బచ్చలి పకోడి ఎలా చేయాలో తెలుసా?

మంగళవారం, 5 ఫిబ్రవరి 2013 (12:55 IST)
FILE
ఆకు కూరలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో బచ్చలికూరకి ఓ ప్రత్యేకత ఉంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే బచ్చలి రక్తవృద్ధికి ఎంతో దోహదపడుతుంది. అలసటను సైతం దూరం చేసే బచ్చలిని కూరలు మాత్రమే గాకుండా పకోడీ చేసుకు తింటే మాంచి టేస్ట్‌గా వుంటాయి. బచ్చలితో పకోడీలు తయారు చేయాలంటే..?

కావాల్సిన పదార్థాలు :
బచ్చలి - 2 కట్టలు
శనగపిండి - కప్పు
బియ్యప్పిండి - కప్పు
కార్న్‌ఫ్లోర్ - కప్పు
పెరుగు - కప్పు
కారం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
తినే సోడా - అర టీ స్పూన్
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి - 2
నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం : వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన పచ్చిమిర్చితో పాటుగా శనగపిండి. బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌లను పెరుగుతో కలిపి పక్కన ఉంచాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె వేడయ్యాక కలిపిన బచ్చలి మిశ్రమాన్ని పకోడీల్లా వేసి, దోరగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి