బ్రేక్ ఫాస్ట్ : కొబ్బరిపూరి చేయడం ఎలా?

FILE
బాలింతలను అధిక రక్తస్రావము ఇబ్బందింది పెడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్‌తో సత్వర ఉపశమనం లభిస్తుంది. అలాగే నిత్యం కొబ్బరి నీళ్లు, కొబ్బరి తురుమును కూరల్లో తీసుకుంటూ వస్తే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది. అలాంటి కొబ్బరితో పూరి చేస్తే ఎలా ఉంటుంది. అయితే ట్రై చేసి చూద్దామా..

కావాలసిన పదార్థాలు :
మైదా పిండి : ఒక కప్పు
గోధుమ పిండి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : తగినంత
పంచదార : అర టీ స్పూన్

ఫిల్లింగ్ కోసం.. ఒక కప్పు కొబ్బరి తురుము, అర కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల నూనె, పచ్చిమిరపకాయ, అల్లం, కారం, ఉప్పు.

తయారీ విధానం :
ముందుగా మైదా, గోధుమ పిండి, ఉప్పు, నూనె తగినన్ని నీటితో కలుపుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వేసి కొద్ది నిమిషాలు వేయించి కొబ్బరి తురుము, శనగపిండి కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం కొద్దిగా నీరు వేసి కలియబెట్టాలి. చల్లారనిచ్చి చిన్న, చిన్న ఉండలు తయారుచేసుకోవాలి.

పిండిని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకుని కొద్దిగా నొక్కి.. నడుమ కొబ్బరి మిశ్రమం ఉంచి పూరీలు నొక్కుకోవాలి. మిశ్రమం వెలికిరాకుండా జాగ్రత్త పడాలి. నూనెలో ఈ పూరీలను వేయించి.. వేడివేడిగా ఏదైనా చట్నీ నంజుకుని తింటే బావుంటాయి.

వెబ్దునియా పై చదవండి