మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీలతో బోర్ కొట్టేసిందా.. అయితే మటన్ కుర్మా తయారు చేసి చూడండి. పిల్లల, పెద్దల ఆరోగ్యానికి శక్తినిచ్చే మటన్ కుర్మాను ఎలా చేయాలంటే..?
మటన్ కుర్మాకు కావల్సిన పదార్థాలు : మటన్ ముక్కలు - కేజీ ఉల్లిపాయలు - 4 (సన్నగా తరగాలి ) పెరుగు - 3 కప్పులు కారం: 2 టెబుల్ స్పూన్లు ధనియాల పొడి : 2 టెబుల్ స్పూన్లు పసుపు - టీ స్పూన్ జీలకర్ర పొడి - పావు టీ స్పూన్ లవంగాలు - 5
ఏలకులు (పచ్చివి) - 6 దాల్చిన చెక్క - అంగుళం కుంకుమ పువ్వు - కొన్నిరేకులు ఉప్పు - తగినంత అల్లం పేస్ట్ - టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ నూనె - కప్పు నెయ్యి - అర కప్పు ఫ్రెష్క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : ముందుగా పాన్లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్లో వేసి గ్రెండ్ చేసుకోవాలి. అదే పాన్లో మరికొంచెం నూనె వేసి మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దీంట్లో కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, నల్లమిరియాలు పొడి, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క జీలకర్ర పొడి, పెరుగు రెండు కప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి.
తర్వాత ఉల్లిపాయ పొడి వేసికలపాలి. ముక్క ఉడికి, నూనె పైకి తేలుతున్నప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిమిషాలు ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. నోరూరించే మటన్ కుర్మాను వేడి వేడిగా నాన్ లేదా చపాతీలోకి వడ్డించాలి.