కావలసినని : మునగాకు : కప్పు జీలకర్ర : టీస్పూను వెల్లుల్లి : 6 రెబ్పలు నువ్వులు : పావు కప్పు పసుపు : కొద్దిగా ఉప్పు : తగినంత నూనె : 2 టీస్పూన్ పచ్చిమిర్చి : ఆరు చింతపండు : కొద్దిగా
తయారు చేసే విధానం : ముందుగా బాణిలో నువ్వులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే బాణిలో నూనె వేసి కాగాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మునగాకు వేసి వేయించి చల్లార్చాలి.
మిక్సిలో ముందుగా నువ్వులు వేసి పొడి చేశాక, వెల్లుల్లి, జీలకర్ర, వేసి తిప్పాలి. తరువాత పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. చిన్న బాణిలో కొద్దిగా నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేయించి పచ్చడిలో కలపాలి.