సేమ్యాతో కిచిడి ఎలా చేస్తారు?

FILE
సేమ్యాలో సోయా ఉండటం ద్వారా ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్‌ను ఎప్పటికీ సక్రమంగా ఉంచుతుంది. సులభంగా జీర్ణమయ్యే సేమ్యాతో కిచిడీ తయారు చేయడం మీకు తెలుసా.. అయితే ట్రై చేసి చూడండి.

సేమ్యా కిచిడి నలుగురికి

కావలసిన పదార్థాలు :
సేమ్యా - 350 గ్రాములు
పసుపు - చిటికెడు
ఉల్లి తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి - రెండు
టమోటా తరుగు - రెండు
నూనె - తగినంత
ఆవాలు, కరివేపాకు, మినపప్పు - ఒక్కో స్పూన్.

ముందుగా తరిగిన కరివేపాకు, టమోటా, ఉల్లి, పచ్చిమిర్చిలను ఓ పాత్రలోకి తీసుకుని ఐదు గ్లాసుల నీటిని చేర్చి ఉడికించాలి. మరో పాన్‌‌లో నూనె కాగాక ఆవాలు, పోపు దినుసులు, కాస్త కరివేపాకు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు వేసి బాగా వేపాలి.

కాసేపు ఉడికాక సేమ్యాను వేసి కలుపుకోవాలి. స్టౌ మంట తగ్గించి పసుపు చేర్చి, మరో పాన్‌లో ఉడికించిన టమోటా, కరివేపాకు ఉల్లి తరుగుల్ని ఇందులో చేర్చుకోవాలి. స్టౌను సిమ్‌లో ఉంచి సేమ్యా ఉడికేంత వరకు కలుపుతూ వుండాలి. తర్వాత కావలసినంత ఉప్పు చేర్చి.. నీరు ఇరిగాక దించేయాలి. ఈ సేమ్యా కిచిడిని కొబ్బరి చట్నీతో గానీ, కొత్తిమీర చట్నీతో గానీ సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి