తామరపూవు, తామర కాడలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్దాయం పెరగాలంటే.. తామర కాడ వేపుడును వారానికోసారి తీసుకుంటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఉడికించకుండా తామరకాడను నమిలి తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలంటూ వుండవు.
తామరకాడలోని తెల్లని భాగంలో పీచు పుష్కలంగా వుంటుంది. తామరకాడలు నీటిలోపల పెరగడం ద్వారా.. వాటిని అలాగే పచ్చిగా నమిలి తీసుకుంటే.. పొట్ట, రక్తంలోని వేడి తగ్గుతుందని చైనా ఆయుర్వేదం చెప్తోంది. ఇంకా దాహార్తి తగ్గుతుంది. మద్యం సేవించిన తర్వాత నోటిలో ఏర్పడే చేదును, రక్తవాంతులను తామర కాడ నిరోధిస్తుంది.