భార్యాభర్తలు గొడవపడుతున్నారా? లావైపోతారట..!

గురువారం, 20 ఆగస్టు 2015 (16:11 IST)
డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా..? భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతున్నారా..? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే భార్యాభర్తల గొడవకు.. లావుకి సంబంధం ఉందని ఒహియో వర్శిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. దంపతుల మధ్య గొడవలకు.. ఎపిటైట్ అంటే ఆకలికి సంబంధించిన హార్మోన్ సంబంధం వుందియ ఆ హార్మోన్ వల్లే గొడవలు పడిన జంటకు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కలిగి ఎక్కువగా తినేస్తుంటారని పరిశోధకులు అంటున్నారు. 
 
ఈ పరిశోధనకు నేపథ్యం వహించిన లిసా జరెమ్కా ఏమన్నారంటే.. మొత్తంమీద వైవాహిక బంధంలోని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధ్య సంబంధం ఉందని చెప్పారు. పరిశోధనలో ప్రత్యేకంగా రక్తనమూనాలు పరీక్షించడంతో పాటు ఇతరత్రా ప్రశ్నావళి టెస్టుల్లో తేలిందేమిటంటే.. గొడవపడినప్పుడే కాకుండా గొడవల నుంచి బయటపడ్డాక కూడా ఎక్కువ కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తింటున్నారు. 
 
వాదులాటల వల్లే ఆకలి పుడుతుందని కరెక్టుగా చెప్పలేం. కానీ ఆ రెండింటికీ మధ్య మాత్రం బలమైన సంబంధం ఉంది. అంటున్నారు పరిశోధకులు. అయితే గొడవలు పడి లావెక్కాక స్లిమ్ అవ్వాలని జిమ్‌ల చుట్టూ తిరిగే బదులు గొడవపడటం మానేస్తే సరిపోతుందని పరిశోధకులు అంటున్నారు.   

వెబ్దునియా పై చదవండి