పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే?

సెల్వి

మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:53 IST)
క్యాన్సర్ నివారించడానికి పొన్నగంటి కూర సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. పొన్నగంటి ఆకులు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. 
 
వారంలో ఒక్కసారైనా పొన్నగంటి ఆకు కూరను తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దానివల్ల శరీరానికి, చర్మ సౌందర్యానికి కంటి చూపుకు చాలా మంచి కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
నరాల నొప్పి, వెన్నునొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఈ ఆకుతో కూరని చేసుకొని తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పొన్నగంటి ఆకులో బి6, సి, ఏ విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. 
 
బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. ఎముకల ఎదుగుదలకు ఇందులో లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది. అంతేకాదు బరువును నియంత్రించడంలో పొన్నగంటి ఆకు ఎంతగానో మేలు చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు