ఈ తాజా అధ్యయనం మేరకు.. రెడ్ వైన్ ఆరోగ్యకరమనే వాదనకు ఎలాంటి ఆధారం లభించలేదు. రెడ్ వైన్‌లోని రైస్ వెరట్రాల్ సహా ఇతరాత్రా యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యానికి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ యాంటీ ఆక్సిడెంట్లతో మేలు జరుగుతుందని, కేన్సర్ ముప్పు తగ్గుతోందని కానీ చెప్పలేమన్నారు. తమ పరిశోధనలో గట్టి ఆధారాలు ఏవీ లభించలేదన్నారు.
వైట్ వైన్ తరచుగా తాగే మహిళల్లో చర్మ కేన్సర్ ముప్పు 22 శాతం పెరుగుతోందన్నారు. కాగా, రోజువారీ జీవితంలో సూర్యకాంతికి ఎక్కువగా గురికావడం సహా ఇతరాత్రా అలవాట్లు కూడా ఈ ముప్పు పెరగడానికి కారణం కావచ్చని వివరించారు.