పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు.
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రధాన అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. చిన్నవిషయానికే చికాకుపడతారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు ముందుకు సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు, ఆరోగ్యం మందగిస్తుంది.
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యం కావు. వేడుకకు హాజరవుతారు.
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్య ఎదురవుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు త్వరితగతిన సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.